ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ ప్రకటన చేయాలని టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. వరద నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అమరావతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. అమరావతిపై మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా జగన్ ఎందుకు స్పందించడంలేదని అనురాధ ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై తెర వెనుక లాలూచీ ఏంటో జగన్ బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.
విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధానికే ఎక్కువమంది మొగ్గు చూపిన విషయం శివరామకృష్ణన్ కమిటీలో ఉందన్న సంగతి బొత్స గ్రహించాలని ఆమె హితవు పలికారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇప్పుడు రోడ్లపై తిప్పుతున్నారని మండిపడ్డారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత కూడా సీఎం వరదలపై సమీక్ష నిర్వహించకపోవడం దారుణమని విమర్శించారు.


మా ప్రభుత్వంలో ఆడపిల్లలకు పూర్తి రక్షణ: ఎమ్మెల్యే రోజా