telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

యురేనియం తవ్వకాల పై స్పందించిన అఖిలప్రియ

bhuma akhila into ycp soon

యురేనియం తవ్వకాల పై మాజీ మంత్రి అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడలో మీడియాతో ఆమె మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడవులను ధ్వంసం చేసి మరీ యురేనియంను తవ్వితీయాల్సినంత అవసరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. నల్లమల అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాల కారణంగా స్థానికంగా నివసించే చెంచులు, సమీప గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.

ఈ తవ్వకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. యురేనియం తవ్వకాలను నిరోధించాలని అన్నారు. కడప జిల్లా తుమ్మలపల్లె గ్రామవాసుల పరిస్థితి చూశామని, ఆళ్లగడ్డలో యురేనియం ప్లాంట్ ను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ అంశం పై ట్వీట్ చేసిన ఆమె చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, లోక్ సత్తా జేపీలను ట్యాగ్ చేశారు.

Related posts