తమిళనాడు సీఎం పళనిస్వామి సుజిత్ మరణంతో ప్రభుత్వ యంత్రాంగం పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వేగంగా స్పందించారు. 2015లో జారీ చేసిన గెజిట్ను సూచిస్తూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బోరుబావుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడుసహా సుజిత్ మరణం దేశవ్యాప్తంగా ఎంతో మందిని విషాదానికి గురిచేసింది. తిరుచి జిల్లాలో మూడేళ్ల సుజిత్ బోరుబావిలో పడి దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. సుజిత్ అంత్యక్రియలకు వేలాది మంది హాజరై కన్నీరుమున్నీరయ్యారు. సుజిత్ విషాదం ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నది. ఈ క్రమంలో ఇలాంటి చర్యలు భవిష్యత్లో పునరావృతం కాకుండా తమిళనాడు సరిద్దిద్దే చర్యలు చేపట్టింది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఈకే పళనిస్వామి నిర్ణయం తీసుకొన్నారు.
బాబు అప్పుడు హైదరాబాద్ వదిలివచ్చారు..ఇప్పుడు అక్కడికే పారిపోయారు!