2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ఎస్‌పీ జననాథన్ ఆదివారం మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డైరెక్టర్ జననాథన్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు డైరెక్టర్ ఆర్ముగకుమార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. జననాథన్ అకాల మరణంపై తమిళ పరిశ్రమకు చెందిన పెద్దలు, ఇతర నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జననాథన్‌కు రోల్ మోడల్, కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ అని, కారల్ మార్క్స్ వర్ధంతి రోజునే జననాథన్ కన్నుమూశారంటూ గుర్తు చేసుకున్నారు. కాగా… 2003లో అయ్యర్‌కై అనే మూవీతో డైరెక్టర్‌గా తొలి మూవీతోనే జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. ఆయన ప్రస్తుతం విజయ్ సేతుపతి-శృతి హాసన్‌లతో “లాభం” సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది.
previous post