పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
ఈ 29 ఏళ్ల షూటర్కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. ఈ ఆటగాడు తొలి ఒలింపిక్స్ లో నే పతకం సాధించాడు.
ఈ ఆటగాడు 12 ఏళ్లుగా ఒలింపిక్స్ లో అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. పారిస్ లో అతనికి అవకాశం రావడంతో చరిత్ర సృష్టించాడు.
ఇక చైనాకు చెందిన లియు యుకున్ 463.6 పాయింట్లతో స్వర్ణం గెల్చుకోగా, ఉక్రెయిన్కు చెందిన సెర్హి కులిష్ 461.3 స్కోరు చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.


బాబు గుడ్డలు చించుకుంటున్నారు: విజయసాయి