సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సూరారై పొట్రు’. ‘గురు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదలకానుంది. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సిఖ్య ఎంటెర్టైన్మెంట్స్ మరియు 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను చిత్రంను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీలో అతి త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. అందుకే భారీ మొత్తానికి ఈ సినిమాను సదరు ఓటీటీ కొనుగోలు చేసిందని టాక్.
next post

