telugu navyamedia
సినిమా వార్తలు

‘సూర్య 42’ సినిమా నుంచి సర్ ప్రైజ్ మోషన్ పోస్టర్ రిలీజ్..

కోలీవుడ్ స్టార్ హీరో ‘సూర్య 42’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య‌కు జంట‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ హీరోయిన్ గా చేస్తుంది.

విలక్షణ నటనతో తమిళంతో పాటు.. తెలుగులో కూడా  తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ ను.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హీరో సూర్య.

తాజాగా  అభిమానులకు ఈ సినిమా యూనిట్  సర్ ప్రైజ్ ఇచ్చింది.విజువల్ వండర్ గా రూపొందిన ఈ మోషన్ పోస్టర్ సినీ లవర్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఉహించని విధంగా అద్భుతమైన విజువల్స్ తో ఈ  వీడియోను డిజైన్ చేశారు.

యుద్ధ భూమిలో మంటలు చెలరేగుతుండగా.. ఓ గద్ద ఆకాశంలో విహరిస్తుంది. నెమ్మదిగా సూర్య భుజం మీద వాలడంతో అతని బ్యాక్ సైడ్ లుక్ ని చూపించారు. చేతిలో ఆయుధాలతో సూర్య యుద్ధ పరాక్రమవంతుడిగా కనిపిస్తున్నారు.

 ఈ మోషన్ పోస్టర్  చూస్తుంటే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాగా అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా తెలిపారు.

Related posts