telugu navyamedia
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న”సూపర్ డీలక్స్”

Super-Deluxe

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న తమిళ చిత్రం “సూపర్ డీలక్స్”. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ “లీల” అనే శృంగార తారగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కన్పించనుండగా, సమంత కూడా రెండు సరికొత్త షేడ్స్ లో కనిపించనుందని తెలుస్తోంది. ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు “ఎ” సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్రాన్ని ఈనెల 29న తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగులో సమంత, రమ్యకృష్ణకు మంచి క్రేజ్ ఉంది. విజయ్ సేతుపతికి కూడా బాగానే అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈ సినిమా వసూళ్లు భారీగా వుంటాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సిందే.

Related posts