భారత జట్టు తమ దృష్టిని మరల్చి విజయం సాధించిందని టిమ్ పైన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించాడు.‘డిసెంబరు-జనవరిలో భారత్‌తో జరిగిన సిరీస్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఇప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నాడు. ఆ సిరీస్‌లో ఓటమిని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు ఇంకా జీర్ణించుకోలేదని పైన్ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోంది. ఏ విధంగా చూసినా పైన్ మంచి వ్యక్తే. అందరూ అతన్ని ఎంతో గౌరవిస్తారు, ఇష్టపడతారు. 2018 టాంపరింగ్ ఉదంతం అనంతరం అతను కెప్టెన్సీని నిర్వర్తించిన తీరే అందుకు కారణం. అతని నాయకత్వంలోని జట్టు ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొన్నట్లు కనిపిస్తోంది. పైన్‌లో వ్యూహరచన లోపాన్ని కూడా విస్మరించేంతగా అతణ్ని నమ్మారు. ఈ లోపాలు కొంతకాలంగా స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఇంగ్లండ్‌లో యాషెస్‌ను ఆసీస్ నిలబెట్టుకోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా మూల్యం చెల్లించుకుంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ టెస్టులో బెన్ స్టోక్స్. . ఆఖరి బ్యాట్స్‌మన్ జాక్ లీచ్‌తో కలిసి ఇంగ్లండ్‌ను గెలిపించిన తీరు చూస్తే పైన్ వ్యూహ రచన నైపుణ్యం ఎలాంటిదో అర్థమవుతుంది అని అన్నాడు.
previous post