బీసీసీఐ ఆటగాళ్ల మధ్య బేధాలు చూపిస్తుంది అని భారత మాజీ ఆటగాడు, లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపారు. బీసీసీఐ ఆటగాళ్లను అందరిని సమానంగా చూడటం లేదు అని.. ఒక్కొక్కరికి ఒక్కో నియమని పాటిస్తుంది అని పేర్కొన్నాడు. అయితే గవాస్కర్ ఇలా మాట్లాడటానికి కారణం… విరాట్ కోహ్లీ భారత్ కు తిరిగి రావడమే. అయితే తన భార్య అనుష్క శర్మ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో కోహ్లీ మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడకుండా… భారత్ కు వచ్చేస్తున్నాడు. ఈ విషయం పై గవాస్కర్ స్పందిస్తూ… యూఏఈ లో ఐపీఎల్ చివర్లో భారత బౌలర్ నటరాజన్ భార్య ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పుడు అతడిని ఇండియాకు పంపించకుండా… టీ 20 జట్టుకు ఎంపిక చేసి ఆసీస్ తీసుకెళ్లింది. ఆ తర్వాత అతడిని వన్డేలో కూడా ఆడించింది. ఆ తర్వాత కూడా అతడిని తిరిగి పంపించకుండా… ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో నెట్ బౌలర్ గా కొనసాగిస్తోంది. అందువల్ల అతను ఇప్పటివరకు తన బిడ్డను చూసుకోలేదు. కానీ భారత కెప్టెన్ కోహ్లీని మాత్రం తిరిగి పంపించడం ఎంత వరకు సరైన నిర్ణయం అని గవాస్కర్ ప్రశ్నించాడు. చూడాలి మరి ఈ విషయం పై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుంది అనేది.
previous post