తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానంలో విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. జూన్‌లో పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్‌ని స్వరూపానంద ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఫాం హౌజ్‌లో స్వరూపానంద స్వామి రాజశ్యామల యాగం నిర్వహించారు.
ఎన్నికల తర్వాత విశాఖలో స్వరూపానంద స్వామిని కేసీఆర్ కలిశారు.గత ఏడాది విశాఖపట్నంలోని శారదా పీఠాన్ని కేసీఆర్ దంపతులు సందర్శించారు. ఎన్నికల ముందు తనకు రాజశ్యామల యాగం చేసిన పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు పొందారు. కేసీఆర్ దంపతులకు స్వయంగా స్వరూపానందేంద్ర స్వాగతం పలికారు. అనంతరం, స్వామీజీకి కేసీఆర్ నూతన వస్త్రాలు సమర్పించారు. అక్కడి శారదా మాతను దర్శించుకుని పూజలు చేశారు.
చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడ్డారు: రోజా