తెలుగు సినిమాకు పెట్టని ‘కోట’ తెలుగు సినిమా విలక్షణ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఆకస్మిక మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కె .ఎస్ .రామారావు, కార్యదర్శి తుమ్మల రంగారావు ఒక ప్రకటనలో సంతాపాన్ని తెలిపారు.
1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా సినిమా రంగంలో ప్రవేశించిన కోట శ్రీనివాసరావు 1985లో నటించిన ‘ప్రతిఘటన’ సినిమా స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది.
ఆ తరువాత ఆయన నట జీవితం అనేక వైవిధ్యమైన పాత్రలతో విజయవంతంగా సాగింది.
2023లో ఆయన నటించిన చివరి చిత్రం ‘సువర్ణ సుందరి’. శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ రంగాల్లో 750 చిత్రాల్లో నటించారు.
కోట శ్రీనివాసరావు మా ఫిలింనగర్ కల్చరల్ సభ్యుడు. కోట శ్రీనివాస రావు కుటుంబ సభ్యలకు కల్చరల్ సెంటర్ తరుపున సంతాపాన్ని తెలియజేస్తున్నాము అన్నారు.

