telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్‌ను “ఢీ” కొట్టేందుకు బన్నీ మాస్టర్‌ ప్లాన్..!

Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ నిర్మాణంలో రూపొందుతున్న‌ క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ పుష్ప‌. అలా వైకుంట‌పురంలో మరియు రంగస్థలం వంటి ఇండ‌స్ట్రీ హిట్స్ త‌రువాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న మూవీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తో పాటు అటు సామాన్య ప్రేక్ష‌కుల్లో కూడా భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పుష్ప ఫ‌స్ట్ లుక్ కి ప్రేక్ష‌కులు, అభిమానుల ద‌గ్గ‌ర‌ నుంచి అనూహ్యమైన స్పంద‌న ల‌భించిన సంగ‌తి తెలిసిందే, అయితే పుష్ప షూటింగ్ ఎప్పుడు మొద‌లౌవుతుందా అనే ఉత్కంఠ సైతం అంత‌టా నెల‌కొంది. ఈ ఉత్కంఠ‌కి తెర‌దించుతూ పుష్ప చిత్ర బృందం త‌మ తొలి షెడ్యూల్ షూటింగ్ మొద‌లుపెట్టేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మ‌న్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ న‌వంబర్ 10 నుంచి ప్రారంభం అయింది. అయితే… టాలీవుడ్‌ లో దూసుకుపోతున్న బన్నీ బాలీవుడ్‌ లోనూ అడుగు పెట్టాలని ప్లాన్‌ చేస్తున్నాడట. దీనికి కారణం టాలీవుడ్‌లో అగ్రహీరోల మధ్య పెరుగుతున్న పోటీనే దీనికి కారణమని టాక్‌. అయితే.. ఇక్కడి హీరోలు దక్షిణాదితో పాటు ఉత్తరాదిని ఎలేందుకు అటు కన్నేసిన విషయం తెలిసిందే. వారిలో ఇప్పటికే ప్రభాస్‌ ఓ రేంజుకెళ్లాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ పుష్పతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాదిలో నాలుగు భాషల్లో విడుదల కానుంది. అదే విధంగా హిందిలోనూ రిలీజ్‌ చేసేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం.

Related posts