telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా బారిన పడి హాలీవుడ్ నటుడు మృతి

jack

కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘స్టార్‌ వార్స్‌’ ఫేమ్‌ 76 సంవత్సరాల ఆండ్రూ జాక్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి జిల్‌ మెకలాగ్‌ బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఆస్ట్రేలియాలో ఉన్న జాక్‌ భార్య గేబ్రియల్‌ రోజర్స్‌ ఆయన మృతిపై స్పందిస్తూ.. ‘‘ రెండు రోజుల క్రితం జాక్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం ఎటువంటి బాధలేకుండా ప్రశాంతంగా కన్నుమూశార’ని పేర్కొన్నారు. కాగా 25 సంవత్సరాల అమెరికా కంట్రీ సింగర్‌ కేలీ షోర్‌  కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉన్నానని.. అయినా తనకు మహమ్మారి సోకిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Related posts