శ్రీశైలం ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో అధికారులు ఎత్తివేశారు. డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేశారు. నాలుగు గేట్లను ఎత్తి 1.06 లక్షల క్కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు ప్రాజెక్టు గేట్ల వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సుందర దృశ్యాలను చూస్తూ కేరింతలు కొట్టిన సందర్శకులు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.

