ఏపీఎస్‌ఆర్టీసీ లో కొత్త బస్సులు కొలువుదీరనున్నాయి. రవాణా అవసరాల నేపథ్యంలో ఈ బస్సుల కొనుగోలు కు ప్రభుత్వం సిద్ధం అవడంతో, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) కొత్తగా 84 ఏసీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిలలో ఏసీ సీటర్ విభాగంలో 48 ఇంద్ర బస్సులు, 4 అమరావతి బస్సులు.. ఏసీ సీటర్+స్లీపర్ విభాగంలో నైట్ రైడర్ పేరుతో తిప్పేందుకు వీలుగా 12 బస్సులు, ఏసీ స్లీపర్ విభాగంలో 20 వెన్నెల బస్సులు ఉంటాయి. వెన్నెల బస్సులలో ఇప్పటికే 10 సంస్థ గూటికి చేరాయి. ఈ పది బస్సులలో విజయవాడ రీజియన్ పరిధిలోని విజయవాడ-హైదరాబాద్, విజయవాడ-చెన్నై, విజయవాడ-బెంగళూరు మార్గంలో రెండు చొప్పున ఆరింటిని నడపనున్నారు.
విశాఖ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం-హైదరాబాద్ మార్గంలో రెండింటిని, తిరుపతి రీజియన్ పరిధిలోని తిరుపతి-హైదరాబాద్ మార్గంలో మరో రెండింటిని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ఏసీ స్లీపర్ బస్సులు 30 బెర్తులను కలిగి ఉంటాయి. 2+1 తరహాలో రూపొందించారు. వీటిలలో ప్రయాణికుడి బెర్త్ పక్కనే లగేజీ క్యారియర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
కంగన అండగా నిలిచిన సందర్భం ఒక్కటీ లేదు… : తాప్సి