telugu navyamedia
క్రీడలు వార్తలు

భువీ, బుమ్రా బౌలింగ్‌లో తేడా అదే…

ఐపీఎల్ 2021లో భాగంగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది. స్లాగ్‌ ఓవర్లలో బుమ్రా హైదరాబాద్‌ను అద్భుతంగా కట్టడి చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఓ వికెట్‌ తీసి 14 పరుగులే ఇచ్చాడు. ఇదే మ్యాచులో ఆడిన మరో భారత స్టార్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ తేలిపోయాడు. 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. తాజాగా ఈ విషయం పై ఇయాన్‌ బిషప్‌ మాట్లాడుతూ… భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రాల బౌలింగ్‌లోని తేడాను వివరించాడు. అదే సమయంలో బుమ్రా సక్సెస్ ఏంటో చెప్పాడు. ‘బుమ్రా అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించిన తర్వాత ఓ దశలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌ను మెరుగుదిద్దుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. స్లో బాల్స్‌ ఎలా వేయాలి. ఆఫ్‌ కటర్స్‌ ఎలా వేయాలి, యార్కర్లు ఎక్కడ సంధించాలి, లెంగ్త్‌ బాల్స్‌ను ఎప్పుడు వేయాలి అనే విషయాలను బుమ్రా బాగా అర్థం చేసుకున్నాడు.పేస్‌ బౌలింగ్‌ను అతను అర్థం చేసుకున్న అమోఘం. బుమ్రా స్థాయి బౌలరే భువనేశ్వర్‌ కూడా. ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. భువీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృష్టి చేస్తాడు. బౌలింగ్‌ వేసేటప్పుడు తన ఆలోచనతో భిన్నమైన బంతుల్ని వేస్తాడు. అతను బుమ్రా కంటే మంచి పేసర్‌ కాకపోవచ్చు. బుమ్రా బౌలింగ్‌లో కంట్రోల్‌ ఉంటుంది. భువీ బౌలింగ్‌లో అది కాస్త లోపిస్తుంది. అందుకే ఇద్దరిలో బుమ్రానే మంచి బౌలర్’ అని ఇయాన్‌ బిషప్‌ అన్నాడు.

Related posts