telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీకాంత్ తనయుడు హీరోగా “పెళ్లి సందడి”

Roshan

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన కొత్త సినిమా పేరు పెళ్లి సందడి అని, ఇందులో నటించే వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయ్యిందని, మ్యూజిక్ సెషన్స్‌ కూడా మొదలయ్యాయని తెలిపాడు. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాత కె.కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే స్టార్‌ క్యాస్టింగ్‌ని మాత్రం రివీల్ చెయ్యలేదు. అయితే ఇందులో హీరోగా నాటి ‘పెళ్లిసందడి’ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. శ్రీకాంత్, ఊహ దంపతుల తనయుడు రోషన్ ఆమధ్య నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని, నటనలో సంపూర్ణమైన శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ‘పెళ్లిసందడి’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 1996లో వచ్చిన ‘పెళ్లిసందడి’ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది.

Related posts