ఇటీవల కాలంలో శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొందరిని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా శ్రీరెడ్డి మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో సీనియర్ హీరో వెంకటేష్ ను టార్గెట్ చేసింది. ఆయన తన కూతురి పెళ్ళికి తనను పిలవలేదంటూ తెగ ఫీల్ అవుతూ మెలికలు తిరిగిపోయింది. వెంకటేష్ ను చిన్న మామయ్య అంటూ… వెంకటేష్ గారి కూతురి పెళ్లికి తనకు కార్డ్ ఇవ్వలేదని… అఫీషియల్ గా తను కోడలు కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా కోడల్నే కదా అని, తనను పిలిస్తే ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని అని, వెంకీ కూతురు చేసుకోబోయే అబ్బాయి రెడ్డీస్ అని తెలిపింది. వెంకీకి కంగ్రాట్స్ చెబుతూ మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని ఓ అభిమానిగా కోరుకుంటున్నానని, తన విషెస్ ని పాజిటివ్ గా తీసుకోవాలని కోరుతూ ఈ వీడియోను పోస్ట్ చేసింది.
రానా స్టార్ కాదు… శ్రీయ కామెంట్స్