“గేమ్ ఆఫ్ త్రోన్స్” టీవీ సిరీస్‌లో సన్సా స్టార్క్‌గా ప్రఖ్యాతి గాంచిన నటి సోఫి టర్నర్ ఆత్మ హత్య చేసుకోవాలనుకుందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. తాజాగా సోఫీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా… అందులో తన యుక్త వయస్సులో ఈ ఆలోచన వచ్చినట్లు చెప్పుకొచ్చారు. “నా యుక్త వయస్సులో చాలా ఒత్తిడిలోకి వెళ్లాను. నాకు ఆ సమయంలో నన్ను ఎవరూ మోటివేట్ చేయలేదు. నా స్నేహితులను కూడా నేను కలవాలనుకోలేదు. ఏడ్చాను.. ఏడుస్తూనే ఉన్నాను. ఈ ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అలా ఎందుకు అనిపించిందో నాకిప్పటికీ అర్థం కాదు” అంటూ సోఫి అన్నారు. సోఫీ “గేమ్ ఆఫ్ త్రోన్స్” సిరీస్‌లో భాగంగా నెడ్ స్టార్క్ కుమార్తెగా 2011లో వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ సిరీస్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు సోఫీ.
next post

