ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ కంటే ముందుగా ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్‌కు మధ్యాహ్నం 1.25కు చేరుకోవాల్సి అరగంట ముందుగా మధ్యాహ్నం 12గం.50ని.కు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు.
ఆపై ఒంటిగంట నుంచి పదిహేను నిమిషాల పాటు బీజేపీ నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు.
అయితే, నిన్ననే బండి సంజయ్ మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేసిన వేళ ఇప్పుడు బీజేపీ నేతలతో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది
మునుగోడు ప్రచారానికి వెళ్లను..పిలవని పేరంటానికి వెళ్లాల్సిన అవసరం లేదు