telugu navyamedia
తెలుగు కవిత్వం

హైద‌రాబాద్ లో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు క‌ల‌క‌లం..

*మోదీకి 17 ప్ర‌శ్న‌లు సంధించిన ప్లెక్సీలు క‌ల‌క‌లం
*హైద‌రాబాద్ లో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు..

ప్రధాని న‌రేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ప‌లుచోట్ల‌ వ్యతిరేక బ్యానర్లు వెలిశాయి. మొత్తం పదిహేడు చోట్ల ప్రధానిని ప్రశ్నిస్తూ.. ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు కేంద్రం ఇస్తామన్న హామీలకు సంబంధించి వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

*తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని ప్రశ్నించారు.

*ఇండియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెంటర్ తెలంగాణ‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ ఓయూలో బ్యానర్ ఏర్పాటు చేశారు.

*హుస్సేన్ సాగర్ వద్ద ఢిఫెన్స్ కారిడార్ ఎందుకు ఇవ్వలేదని బ్యానర్ పెట్టారు.

*కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదాను కల్పించలేదని ప్రశ్నిస్తూ మరో బ్యానర్ ను హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేశారు..

*కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నిస్తూ కూడా రైల్వే లైన్ వద్ద బ్యానర్ కట్టారు.

*నవోదయ స్కూల్స్ ఏమాయ్యాయని ప్రశ్నిస్తూ బ్యానర్లు కట్టారు.

*నిజామాబాద్‌ లో పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తూ మరో చోట బ్యానర్ ఏర్పాటు చేశారు.

*బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు.

*తెలంగాణకు కొత్త నవోదయ విద్యాలయాలు ఎందుకు కేటాయించలేదు అంటూ మ‌రో బ్యాన‌ర్ వెలిసింది.

*ఐఐటీఆర్ ప్రాజెక్టు ఏమైంది అంటూ ప్ర‌శ్నించారు.
*మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధులేవి అంటూ ప్ర‌శ్నించారు.

* ప్రపంచ సంప్రదాయ వైద్య పరిశోధనా కేంద్రం తెలంగాణ నుంచి గుజరాత్‌ ఎందుకు వెళ్లిందంటూ మ‌రో బ్యాన‌ర్‌లో ఉంది.

*పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏది? అంటూ ప్ర‌శ్నించారు

* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫర్ తెలంగాణ ఏది మ‌రో బ్యాన‌ర్ ఏర్పాటు చేశారు.

*హైదరాబాద్ బాధితులకు వరద సహాయ నిధి ఏది మోదీ జీ అంటూ ప్ర‌శ్నించారు.

అయితే ఇవాళ ప్రధాన మంత్రి మోడీ హైద్రాబాద్ కు వస్తున్న తరుణంలో కేంద్రం తీరును ప్రశ్నిస్తూ బ్యానర్లు కట్టడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీకి స్వాగతం పలికే కార్యక్రమానికి కూడా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు

Related posts