telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

చెలి నిరీక్షణ

induvadana poetry corner
పున్నమి నాటి నిండు
జాబిలమ్మలా
ప్రాణ సఖి వదనగగనం
వెలిగిపోతుంది
మిలమిల మెరిసే తారకమ్మలా 
చెలి లేత ఆధారాలపై
చిరునవ్వుల వెలుగుపూలు
పూస్తున్నాయి
జాబిలమ్మ వెన్నెల వన్నెల  
 కాంతుల జలపాతంలో జలకాలాడుతుంది
చంద్రబింబ అద్దంలో పడుచు 
పరువాలు కనువిందు చేస్తున్నాయి
వలచిన చెలికానికై నిలిచిన
వనితలా నా హృదయేశ్వరి
కళ్ళల్లో నిరీక్షణ క్రొవ్వొత్తులు
వెలుగించుకుని ఎదురుచూస్తుంది
పిలిచిన వలపుల నెలరాజుకై
పెళ్ళిచూపుల్లో పెళ్లి కూతురులా 
 ముస్తాబై ముద్దుగుమ్మ కూర్చుంది
వెన్నెల్లో ఆడపిల్ల నాసఖి
గుండెల్లో చిలిపి నాచెలి
–గద్వాల సోమన్న

Related posts