telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

నెరవేరని అల్పత్వం

ఎండకు
ఏ రహస్యాలు కుట్రలు లేవు
ఎజెండాలులేవు
ఎండ దిగంబరుడు
సత్య శోధకుడు !

నీడకు
బహుళ రహస్యాలు
పోల్చుకోలేని అనుమానాలు
ఈర్ష్య అసూయలు
నీడ ముసుగేసుకున్న నిప్పు
నీడ అసత్యవాది !

వానకు
తీరొక్క రుచులు
ఎడతెగని ప్రయాణం
దరి చేరని పడవలు
మొలువని అడుగులు
వానది పుట్టు రాజస్వo
నెరవేరని అల్పత్వం !

చలికి
పట్టలేని పొగరు
పొంతనలేని విరుపు
వొదుగలేని మనసు
పలుకని రాయి
కొన్ని దినాలే సన్మానాలు!

వనపట్ల సుబ్బయ్య

Related posts