శ్రీలంక-భారత పర్యటన జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. గురువారం లంకలో కొత్తగా 3269 కేసులు, 24 మరణాలు సంభవించాయి. గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య మొత్తం 16343లు కాగా మరణాలు 147గా ఉంది. మెల్లగా కరోనా రెండో వేవ్ ప్రభావం అక్కడ కూడా పెరుగుతోంది. వైరస్ కారణంగా గతేడాది జరగాల్సిన శ్రీలంక-భారత్ పర్యటనను ఇప్పటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ‘పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ గతేడాది కరోనా ఉన్నప్పటికీ ఇంగ్లండ్, ఇతర సిరీసులను విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు భారత్తో సిరీసునూ అలాగే నిర్వహిస్తామన్న నమ్మకం ఉంది. ఏదేమైనా కేసులు పెరగకూడదని కోరుకుంటున్నాం’ అని శ్రీలంక క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే ఈ పర్యటనపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. శ్రీలంకతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే.
previous post
next post