కరోనా మరో సినీ ప్రముఖుడిని బలి తీసుకుంది. 1990ల్లో బాలీవుడ్ లో పలు మ్యూజికల్ హిట్స్ అందించిన సంగీత దర్శకుడు శ్రవణ్ కుమార్ రాథోడ్ కన్నుమూశారు. కరోనాతో గత కొన్ని రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం ముంబైలో ఎస్.ఎల్.రహేజ హాస్పిటల్ లో శ్రవణ్ మరణించారు. 1990లలో నదీప్ సైఫీ-శ్రవణ్ కుమార్ రాథోడ్ కలసి నదీమ్ శ్రవణ్ పేరుతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ‘ఆషికి, సాజన్, పూల్ ఆవుర్ కాంటే, సడక్, దీవానా, రంగ్, దిల్ వాలే, గద్దర్, రాజా, బర్సాత్, రాజా హిందూస్థానీ, సిర్ఫ్ తుమ్, కసూర్, రాజ్, ఆతిష్, జడాయి, అందాజ్, బేవఫా’ వంటి సూపర్ హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. 2005 వరకు కలసి ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత విడిపోయారు. దాంతో విడివిడిగా మ్యూజిక్ అందించినా ఎవరూ ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు. శ్రవణ్ మృతిపై నదీమ్ స్పందించారు. తన శాను ఇక లేడని… ఇద్దరం కలిసి ఎన్నో ఎత్తు పల్లాలను చూశామంటూ భావోద్వేగానికి గురయ్యాడు. శ్రవణ్ కుమార్ రాథోడ్ మృతిపై పలువరు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.
previous post
next post

