ఆఫ్ఘనిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలోని బమియాన్ నగరం లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్ల లో 17 మంది మృతి చెందగా.. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో జరిగిన పేలుళ్ల లో 17 మంది మరణించారు. అత్యంత సురక్షిత ప్రాంతంగా పేరొందిన బమియాన్ ప్రావిన్సులో మొట్ట మొదటిసారి పేలుళ్లు జరిగాయి. వేలాది మంది పర్యాటకులు సందర్శించే బమియాన్ లో పేలుళ్లు జరగడం ఇదే మొదటిసారి. ఈ పేలుళ్లకు కారణం ఎవరు అనేది ఇంకా ఎవరూ ప్రకటించలేదు. పేలుళ్లలో క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆఫ్ఘనిస్థాన్ పై ప్రాంతీయ సహకారం పై జరిగిన సమావేశంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘని మాట్లాడుతూ స్థిరమైన శాంతిని నెలకోల్పడానికి బలమైన ప్రాంతీయ ఏకాభిప్రాయం అవసరమని పునరుద్ఘాటించిన సమయంలో ఈ జంట పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది. ఈ ప్రమాదంపై ఆఫ్ఘనిస్థాన్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
previous post


అతడి చెంప పగలగొట్టి, షర్ట్ కాలర్ పట్టుకుని… మెహ్రీన్ కామెంట్స్