“క్షణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడవి శేష్. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు మరోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేషన్‌లో ఓ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి “ఎవరు” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, రెజీనా కసండ్ర హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసినా ప్రీ లుక్ లో అడివి శేష్ విక్రమ్ వసుదేవ్ బ్యాడ్జ్‌తో కన్పించదు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది.
ఇక అడివి శేష్ త్వరలో “మేజర్” సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మేజర్ చిత్రానికి గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాయి.