telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రారంభ‌మైన రెండో రోజు వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాలు- మ‌ధ్యాహ్నం త‌రువాత‌ అధ్య‌క్షుడి ఎన్నిక‌

*రెండో రోజు వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాలు
*తొలిరోజు నాలుగు తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టిన వైసాపా
*ఇవాళ ఐదు తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న వైసీపీ
*మ‌ధ్యాహ్నం త‌రువాత‌ అధ్య‌క్షుడి ఎన్నిక‌
*సాయంత్రం సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం
*ప్లీన‌రీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుగుతుంది. రెండో రోజు వైసీపీ ప్లీనరీ  సమావేశాలు ప్రారంభమ‌య్యాయి.

ప్లీనరీలో తొలి రోజు నాలుగు తీర్మానాలు చేసిన వైసీపీ.. నేడు సామాజిక న్యాయం, పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, దుష్ట చతుష్టయంపై తీర్మానాలు చేయనుంది. అలాగే మ‌ధ్యాహ్నం త‌రువాత‌ అధ్య‌క్ష ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముగింపు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈరోజు జగన్ ఉపన్యాసంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.  2024 ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను సీఎం ప్రకటించనున్నారు.

మ‌రోవైపు రెండోరోజు వైఎస్సార్సీపీ ప్లీనరీకి పార్టీ శ్రేణులు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు సైతం కోలాహలంగా ప్లీనరీకి హాజరవుతున్నారు. ఉదయం నుండి వర్షాన్ని లెక్కచేయకుండా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

Related posts