ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 1న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఎస్ఈసీ… గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఈ మేరకు ఆహ్వానం పంపింది.. మార్చి 1న ఉదయం 9.30 గంటలకు ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్కరు రావాలని రాష్ట్ర ఎన్నికలు సంఘం ఆ ఆహ్వానాల్లో పేర్కొంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, ప్రవర్తనా నియమావళిని పాటించాలని రాజకీయపక్షాలను కోరేందుకు సిద్ధమవుతోంది ఎన్నికల కమిషన్.. ఈ సమావేశానికి హాజరుకానున్న రాజకీయపక్షాల నుంచి ఎన్నికల నిర్వహణలో సూచనలు, సలహాలు కూడా స్వీకరించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. కాగా, రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 140 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.. రీ-నోటిఫికేషన్ జారీ చేయగా.. వివిధ కారణాలతో నాలుగు నగరపాలక సంస్థలు, 29 పురపాలికలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. ఇక, గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
previous post
next post
తల్చుకుంటే మీ కంటే పదింతలు చెయ్యగలను..పరిధులు దాటవద్దు