telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

లాడ్జ్ లో మంద కృష్ణ మకాం..అరెస్ట్ చేసిన పోలీసులు!

MRPS manda krishna comments Chandrababu

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన మహా దీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన మంద కృష్ణను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహా దీక్షాస్థలికి వెళ్లాలన్న ఆలోచనతో ఆయన, హైదరాబాద్ కు చేరుకున్నారు.

హబ్సీగూడలోని కృష్ణా లాడ్జ్ లో రహస్యంగా మకాం వేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు, నేటి ఉదయం లాడ్జ్ వద్దకు వెళ్లి, మంద కృష్ణను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే ఆయన్ను నాచారం పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ దీక్షకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఉన్నతాధికారులు, ఇందిరా పార్క్ ప్రాంతానికి ఎవరూ రావద్దని హెచ్చరించారు.

Related posts