సినిమారంగాన్ని ప్రోత్సహించే విషయంలో పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా పరిశ్రమ బాగుపడితే… ప్రభుత్వాలకు పన్నులొస్తాయి… పరిశ్రమను నమ్మకున్నోళ్లకు ఉపాధి లబిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నోవాటెల్ లో సంతోషం సినిమా అవార్డు ప్రధానోత్సవం జరిగింది. తొలిసారిగా సంతోషం సినిమా మ్యాగజైన్, డిజిటల్ మీడియా దిగ్గజం సుమన్ టీవీతో కలసి సంయుక్తాధ్వర్యంలో సినిమా అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచిసినిమాలకు అవార్డులను అందించే ప్రభుత్వాలు ఆ విషయాన్ని గాలికొదిలేసినట్లున్నాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు.
రాజకీయాలకంటే సినిమా రంగాన్ని ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఐదేళ్లు వేచిచూడాలి. అదే సినిమా రంగంలో అలాఉండదన్నారు. సినిమాలో కథ బాగాలేకుంటే… ఆ సినిమా ఆదరణకు నోచుకోదు తప్ప… కథానాయకులను గుండెల్లో పెట్టుకుంటారని ప్రస్తావించారు. సినిమారంగాన్ని జీవితకాలం వదిలపెట్టబోనని చిరంజీవి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.