telugu navyamedia
రాజకీయ

సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం : ఆందోళనకరంగా ఆరోగ్య పరిస్థితి.. శరీరంపై ఎన్నో గాయాలు.

*సల్మాన్‌ రష్దీపై హత్యాయత్నం ..హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలింపు..
*పోలీసుల అదుపులో నిందితుడు
*1988లో రష్దీ రాసిన శటానిక్‌ వర్సెస్‌ పుస్తకం వివాదాస్పదం..

అమెరికాలోని న్యూయర్క్ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన నెలకొంది. శస్త్రచికిత్స తర్వాత వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయనకు ఒక కన్ను పూర్తిగా కంటిచూపు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కత్తితో తీవ్రంగా పొడవడం వల్ల లివర్ కూడా దెబ్బతినట్లు వైద్యులు చెబుతున్నారు. ఆయన భుజంపై నరాలు తెగిపోయాయని, లివర్ పై కత్తిపోట్లు ఉన్నాయని తెలిపారు.

Salman Rushdie: Author Salman Rushdie On Ventilator After Stabbing, Attacker Identified

కత్తితో దాడిచేసిన వ్యక్తిని న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూకు చెందిన 24 ఏళ్ల హదీ మాటర్ గా న్యూయర్క్ పోలీసులు గుర్తించారు. ఈదాడిలో ఇంకా ఎవరున్నారనేది పూర్తి విచారణ లో తేలనుంది.

న్యూయర్క్ లోని ఓ ఇనిస్టిట్యూట్ లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా ఓ యువకుడు రష్దీపైకి దూసుకొచ్చి కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో రష్దీ ఒక్కసారిగా స్టేజీపై కూలిపోయారు. తక్షణమే ఆయన్ను హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు.

Salman Rushdie stabbed on stage at event in New York state - Nikkei Asia

బాంబేలో ముస్లిం కశ్మీరీ కుటుంబంలో జన్మించిన రష్దీ.. అనంతరం బ్రిటన్‌కు వెళ్లిపోయారు. సల్మాన్ రష్దీ గత 20 ఏళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్నారు. మిడ్‌నైట్స్ చిల్డ్రన్ (1981) రచనకు గానూ అతడికి బుకర్ ప్రైజ్ లభించింది. ఆయన రచించిన ది సాటానిక్ వెర్సెస్ (1988) వివాదాల్లో చిక్కుకుంది.

రష్దీని చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. రష్దీని హత్య చేయాలని ఇరాన్ పిలుపునిచ్చింది. ఆయన రచన ‘ది సాతానిక్ వెర్సెస్’ (1988)లో దైవదూషణ ఉందని ముస్లింలు ఆరోపించారు. చాలా ఇస్లామిక్ దేశాల్లో ఈ పుస్తకాన్ని నిషేధించారు. పలువురు మత పెద్దలు సల్మాన్ హత్యకు పిలుపునిచ్చారు. అతడిపై ఫత్వా సైతం జారీ చేశారు. ఈ పుస్తకాన్ని ట్రాన్‌లేట్ చేసిన జపాన్ రచయిత హితోషి ఐగరషి 1991లో హత్యకు గురయ్యారు.

Related posts