ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో విపక్ష నేతల సమావేశం మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి డీఎంకే నేత కనిమొళి, బీఎస్పీ నేత దనిష్ అలీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అభిషేక్ మనూ సంఘ్వీలు హాజరయ్యారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలుబడిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు గురించి విపక్ష నేతలు సమావేశంలో చర్చిస్తున్నారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరంనేతలంతా ఈ రోజు ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. సీపీఎం నేత సీతారం ఏచూరి, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్, ఆర్జేడీ నేత మనోజ్ జా, ఎన్సీపీ నేత మజీద్ మీమన్ తో పాటు 19 నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేస్తున్నారు: రోజా