telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఓటీటీలో విడుదల కానున్న ఆ క్రీడాకారిణి బయోపిక్…

Saina

ప్రస్తుతం మన దేశంలోని ఏ సినీ పరిశ్రమలో అయిన బయోపిక్స్ సినిమాల హవా నడుస్తుంది. అయితే ఒలంపిక్స్ లో మొదటి పథకం సాధించిన మహిళా బాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు నమోదుచేసిన సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా నటిస్తోంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ కోసం పరిణితీ చోప్రా బాడ్మింటన్ నేర్చుకుంటూ చాలానే కష్టపడుతుంది. కాగా, గతేడాది వేసవిలోనే ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయింది. తాజాగా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు ఇష్టపడట్లేదట నిర్మాత. థియేటర్లకు ఇంకా పూర్తిస్థాయి సడలింపులు ఇవ్వకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఇప్పటికీ థియేటర్ల 50 % ఆక్యుఫెన్సీతో నడుస్తుండడంతో… త్వరలోనే సైనా బయోపిక్‌ ఓటీటీలో విడుదలవుతుందని బాలీవుడ్‌ లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts