ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్ మండిపడ్డారు. మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలవల్లే మనస్తాపంతో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది కాబోతోందని ఆయన స్పష్టం చేశారు.
చట్టవిరుద్ధమైన సమ్మె చేస్తున్నారని, కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రెచ్చగొట్టడంవల్లే శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని లక్ష్మణ్ అన్నారు. దీనికి పూర్తిగా మంత్రులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
కేసీఆర్ చర్యల వల్ల పుట్టబోయే బిడ్డపై కూడా భారం: రేవంత్ రెడ్డి