telugu navyamedia
సినిమా వార్తలు

రాజమౌళి భారీ ప్లాన్‌..6 రోజులు.. 9 నగరాలు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌,యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్‌గా ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’​. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు.

CONFIRMED! SS Rajamouli's Ram Charan – Jr NTR starrer RRR postponed : Bollywood News - Bollywood Hungama

దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్​ వేగం పెంచుతోంది. కొంచెం కూడా ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. ప్రత్యేక ఇంటర్వ్యూలు, చిట్​చాట్​లు అంటూ దేశమంతటా తిరుగుతోంది.

RRR Team Plans A Marathon Promotional Tour And Are All Set To Visit 9 Cities In 7 Days

ఈ క్రమంలోనే రేపటి నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం సిద్ధమైంది. 6 రోజుల్లో 9 నగరాలను చుట్టిరావాలని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఏ నగరాల్లో, ఎప్పుడెప్పుడు ఈవెంట్స్‌ నిర్వహించబోతున్నారలో తెలియజేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు.

ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్(మార్చి 18)​, దుబాయ్​(మార్చి 18), బెంగళూరు(మార్చి 19), బరోడా(మార్చి 20), దిల్లీ(మార్చి 20), అమృతసర్(మార్చి 21)​, జైపుర్(మార్చి 21)​, కోల్​కతా(మార్చి 22), వారాణాసి(మార్చి 22) మళ్లీ తిరిగి హైదరాబాద్​లో( మార్చి 23)​ ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి అభిమానులను ఉత్సాహపరచనున్నారు..

Photo Moment: Team RRR kickstarts promotions in Kerala | 123telugu.com

ఈ షెడ్యూల్​లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్​ను కూడా భారీగా ప్లాన్​ చేసింది. మార్చి 19న బెంగళూరులోని చిక్కబళ్లాపురలో గ్రాండ్​గా నిర్వహించనున్నట్లు తెలిపింది.

 

Related posts