telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : రెచ్చిపోయిన జడేజా.. బెంగళూరు లక్ష్యం..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జడేజా దుమ్మురేపాడు. చివరి ఓవర్ లో 36 పరుగులు బాది బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాడు. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై జట్టుకు మంది ఆరంభం దక్కింది. ఆ జట్టు ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ అర్ధశతకంతో రాణించగా రుతురాజ్ గైక్వాడ్ (33)తో అతనికి తోడుగా నిలిచాడు. కానీ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత రైనా, డు ప్లెసిస్ కలిసి ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెంగళూరు స్పిన్నర్ హర్షల్ పటేల్ వరుస బంతుల్లో వారిని పెవిలియన్ చేర్చి చెన్నైని దెబ్బ కొట్టాడు. అయితే హర్షల్ వేసిన చివరి ఓవర్లో రవీంద్ర జడేజా(62) 5 సిక్సులు ఒక్క ఫోర్ బాదడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ ఒక్క వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో బెంగళూరు 192 పరుగులు చేయాలి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts