తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్గంపాడు మండలం కృష్టసాగర్ ఎర్రమ్మతల్లి ఆలయం వద్ద బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
బుధవారం ఉదయం కొత్తగూడెం నుంచి అశ్వాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఆశ్వాపురం మండలం అమ్మగారి పల్లి గ్రామానికి చెందిన అసిఫ్ పాషా(29), భీష్మ రెడ్డి లుగా గుర్తించారు..
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.