చిత్తూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు . మృతులను గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గుంటూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా మార్గమద్యంలో ప్రమాదం జరిగింది. ఘనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.