రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డిని ఓ దుండగుడు ఆమె కార్యాలయంలోనే సజీవదహనం చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలకం రేపుతుంది. సురేశ్ అనే వ్యక్తి విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటన పై ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మార్వో సజీవదహనం సంఘటన బాధాకరమని అన్నారు.
ప్రజల కోసం పనిచేసే అధికారులపై ఇలాంటి కిరాతకాలకు పాల్పడడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎమ్మార్వో తీరు నచ్చకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ప్రాణాలు తీసేంత దారుణాలకు ఒడిగట్టడం సబబు కాదన్నారు. దీనివెనుక ఏం జరిగిందన్న విషయం పూర్తిగా తెలుసుకోవాలని అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని అన్నారు.
రాచరిక పాలనలో తెలంగాణ బందీ: రేవంత్రెడ్డి