telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడుతున్నారు: ఆగ్రహం వ్యక్తం చేసిన చికోటి ప్రవీణ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హిందూమతంలో కోట్లాది మంది దేవతలు ఉన్నారు అన్నారు.

వివాహం కాని వారికి హనుమంతుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మద్యపానం చేసేవారికి ఇంకొక దేవుడు ఉన్నారని, అదేవిధంగా మల్లమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

కల్లు పోసి, కోడిని బలిచ్చే వారికి ఒక దేవుడు, పప్పన్నం తినేవారికి సైతం ఒక దేవుడు ఉన్నారని, మనకు అన్ని రకాల దేవుళ్లు ఉన్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై చికోటి ప్రవీణ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి హిందూ దేవతలను కించపరిచేలా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రతి ఎన్నికలోనూ హిందువుల ఓట్లు అభ్యర్థించే ఆయన, హిందూ దేవుళ్ళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడ ఏమిటని ప్రశ్నించారు. వెంటనే రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలకు హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts