telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్.

తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉంది అని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అని అన్నారు.

దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తదితరులంతా ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని ఆయన సోదాహరణగా వివరించారు.

కొందరు వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. కానీ ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన వర్సిటీకి దళితుడిని వీసీ చేసి చూపించామన్నారు.

దేశానికి యువ నాయకత్వం అవసరమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ ఉస్మానియా వర్సిటీనేనని గుర్తు చేశారు.

యూనివర్సిటీలు సమస్యలపై చర్చలకే కాదు సైద్దాంతిక అంశాలకు వేదిక సైతం కావాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చలు జరపాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు, ధనవంతులను చేసేదంటూ విద్యార్థులకు సీఎం రేవంత్ సూచించారు.

మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్న నిర్ణయాలను వ్యతిరేకించండి  అందుకు నిరసన తెలపండంటూ విద్యార్థులకు క్లియర్ కట్‌గా సందేశాన్ని ఇచ్చారు.

కానీ సమస్యలు పరిష్కరించేందుకు వచ్చిన వారిని మాత్రం అడ్డుకోకండంటూ విద్యార్థులకు ఆయన హితవు పలికారు. తాను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని స్పష్టం చేశారు.

డిసెంబర్‌లో మళ్లీ ఆర్ట్స్ కాలేజీలోనే మీటింగ్‌కు హాజరవుతానన్నారు. తాను వచ్చే రోజు క్యాంపస్‌లో ఒక్క పోలీస్ కూడా ఉండొద్దన్నారు. విద్యార్థులను నిరసన చేసుకోనివ్వండంటూ పోలీసులకు సూచించారు.

తానను అడ్డుకునే విద్యార్థులకు సమాధానం చెబుతానంటూ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియం వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

అంతకుముందు ఓయూలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. రూ. 90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ భవనాలను సీఎం ప్రారంభించారు.

దాదాప 20 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఓయూకి సీఎం రాక సందర్బంగా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా యూనివర్శిటీలోని విద్యార్థులు ఆందోళనకు దిగనున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Related posts