భారత యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో తొలి ఇన్నింగ్సులో రిషబ్ పంత్‌తో కలిసి జట్టును ఆదుకున్న సుందర్.. 96 పరుగులు చేసి భారత్ ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు టెస్ట్ సిరీస్‌లో వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో సుందర్‌లో సహజంగానే చాలా సత్తా ఉందని రవిశాస్త్రి మెచ్చుకున్నాడు. 80ల్లో తాను సేవలందించినట్లే సుందర్ ప్రస్తుత భారత జట్టుకు ఉపయోగపడుతున్నాడు అని హెడ్ కోచ్ పేర్కొన్నాడు. నాతో పోలిస్తే సుందర్‌కు సహజసిద్ధమైన నైపుణ్యం మరింత ఎక్కువ. టెస్టుల్లో బౌలింగ్‌పై దృష్టి పెడితే.. అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది. విదేశీ పిచ్‌లపై భారత్‌కు దొరికిన మెరుగైన ఆరో నంబర్ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. లోయర్ ఆర్డర్లో అర్ధ సెంచరీలు చేయడం.. 20 ఓవర్లు వేసి రెండు మూడు వికెట్లు తీయడమే నా పాత్ర. ఇప్పుడు సుందర్ ఇదే పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు అని పేర్కొన్నాడు.
							previous post
						
						
					
							next post
						
						
					

