telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 14 (శనివారం) రాశి ఫలాలు

మేషం : ఉద్యోగస్తులు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆరోగ్యం పర్వలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది.

వృషభం : సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగస్తులు తోటివారితో విందులు వినోదాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధివారికి బాగుంది.

మిథునం : ఆరోగ్యం పర్వలేదు. ఆదాయానికి డోకా లేదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగులకు బాగుంది.

కర్కాటకం : బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం : ఎదుటివారిని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఖర్చులు తగ్గించుకోండి. మీ మంచి కోరుకునే వారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది

కన్య : అనుకోని పనులు పూర్తి చేస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాల వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

తుల : వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది.

వృశ్చికం : సందర్భం బట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగుపడుతుంది. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

ధనస్సు : ప్రైవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్వయంకృషినే నమ్ముకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరం : బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్వీయ సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

కుంభం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం : ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం వుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుంటారు. ఖర్చు విషయంలో జాగ్రత్త. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

Related posts