బిహార్ ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ అధికారికంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది.
సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సహానీని పేర్లను మహాకూటమి ప్రకటించింది.
పాట్నాలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.
ఈ సమావేశం సందర్భంగా అందరం కలిసి ఐక్య ముఖాన్ని ప్రదర్శిస్తూ, ఎన్నికలలో సమిష్టిగా పోరాడాలనే తమ ప్రణాళినకు మహాఘట్‌బంధన్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల పోటీని ‘ప్రజాస్వామ్యం, నిరంకుశ శక్తుల మధ్య యుద్ధం’గా అభివర్ణించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ తరపున రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నాయకుడు పవన్ ఖేరా పాల్గొన్నారు.
ఎన్నికల ఫలితం మహా కూటమికి అనుకూలంగా ఉంటే, రాష్ట్రంలో కొత్త సామాజిక వాస్తవికతకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్