ఐపీఎల్ 2021 మొదలైనప్పటి నుంచి.. సన్ రైజర్స్ వరుస శకులు తగులుతున్నాయి. ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా రైజర్స్ గెలవలేదు. వరుస ఓటములతో సతమతమవుతున్న రైజర్స్ కు మరో షాక్ తగిలింది. రైజర్స్.. బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కు అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్య రావడంతో ఆయనను.. చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఏప్రిల్ 17 నే ఆయన 49 వ ఏట అడుగుపెట్టారు. పుట్టిన రోజు జరిగిన రెండు రోజులకే ఈ అనారోగ్య సమస్య రావడం క్రికెట్ ప్రపంచానికి ఆందోళన కలిగించింది. ప్రస్తుతం మురళీధరన్.. అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. మురళీధరన్ కు యాంజియోప్లాస్టీ చేయబోతున్నట్లు తమిళ మీడియా తెలిసింది. మురళీధరన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. 2015 నుంచి మురళీధరన్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీంకు కోచ్ గా ఉంటున్నారు.
previous post
విషపూరిత రాజకీయాల వల్ల రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: కేశినేని నాని