బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
తాజాగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.ఈ సినిమా రెండు బాగాలుగా విడుదల చేస్తున్నారు. తెలుగులో మొదటి భాగానికి శివ అని నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మస్ర్త తెలుగు ట్రైలర్‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ అందించారు.
నీరు గాలీ నిప్పు ..కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్ర్తాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్తానిది అంటూ చెప్పే చిరు వాయిస్ గంభీరంగా ఉంది.
రణ్‌బీర్, ఆలియా మధ్య కెమిస్ట్రీ… అదిరిపోయే రిచ్ విజువల్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచుతోంది.
భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే ‘బ్రహ్మాస్త్రం’ చిత్ర కథాంశం అంటూ చిత్ర బృందం చెబుతూ వస్తోంది.
దీన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 9 హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు.