telugu navyamedia
సినిమా వార్తలు

పోలీసులను కొట్టిన నటి… కేసు నమోదు

RUhi-Singh

ప్రముఖ మోడల్, పలు టీవీ ధారావాహికల్లో నటించిన నటి రూహీ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. మార్చి 31న రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి ఫుల్లుగా మద్యం సేవించిన ఆమె విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఈ ఘటన లింకింగ్ రోడ్డులో జరిగినట్టుగా తెలుస్తోంది. మందు కొట్టి వెళుతున్న ఆమె కారు యాక్సిడెంట్ కు గురైన కారణంగా పోలీసులు ఆమెను ప్రశ్నించారని తెలుస్తోంది.

ముంబై వీధుల్లో తన కారుతో కొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడు వాహనాలు దెబ్బతిన్నాయి. శాంటాక్రాజ్ వద్ద ఈ ఘటన జరిగింది. 30 ఏళ్ల రూహీ శైలేష్‌కుమార్ సింగ్ తాగిన మత్తుల్లో తన వాహనాన్ని నడిపింది. ఈ ఘటనలో నాలుగు ద్విచక్రవాహనాలు, మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరూ గాయపడలేదు. వాహనాలను ఢీకొట్టి జనంతో ఆ టీవీ నటి వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే ఆమె ప్రశ్నించిన పోలీసును కొట్టింది. దీనిపై ముంబై పశ్చిమ రీజియన్ అదనపు కమిషనర్ మనోజ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ శాంతాక్రజ్ పోలీసులు ఆమెను పరీక్షించగా… ఆమె మద్యం సేవించినట్టు తేలింది. ఆమె రక్త నమూనాలను సేకరించాము. కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇక రూహీ సిన్హా క్యాలెండర్ గర్ల్స్, ఇష్క్ ఫరెవర్, ది వరల్డ్ బిఫోర్ హర్, స్పాట్ లైట్ 2 తదితర చిత్రాల్లోనూ నటించింది.

Related posts