telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానాకు కిడ్నీ సమస్య… అమెరికాలో శస్త్ర చికిత్స ?

Rana

“బాహుబలి”తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో “విరాటపర్వం” సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. అయితే “బాహుబలి” సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా ఈ మధ్య కాలంలో బాగా సన్నబడిపోయాడు. దాంతో రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ అలాంటిదేం లేదని తేల్చేశాడు. “హాథీ మేరే సాథీ” సినిమా కోసమే సన్నబడ్డట్టుగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడేమో రానా గతకొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు మరో కొత్త వార్త హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు రానా అమెరికాలో శ‌స్త్ర చికిత్స చేయించుకోబోతున్నాడ‌ట‌. ఇందుకోసం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి రానా అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కినేని నాగ‌చైత‌న్య త‌ల్లి ల‌క్ష్మి కూడా అమెరికా వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఇటీవలే రానా కంటి సంబంధిత స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే కిడ్నీ స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట‌ప‌డి మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవుతాడని అంటున్నారు ఆయన అభిమానులు.

Related posts